హీరో సుదీప్ ఫ్లాట్ పై నటుడు నరేష్ సంచలనం.. అంతా అక్రమమే !

గోల్ఫ్ ఎడ్జ్ రెసిడెన్సీ లో జరుగుతున్న అక్రమాలపై సినీ నటుడు,మాజీ మా అధ్యక్షులు డాక్టర్ నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్ఫ్ ఎడ్జ్ మాల్యాండ్ లో నిర్మించామని.. 487 ప్లాట్స్ ఉన్నాయి.. 1500 మంది నివసిస్తున్నారని తెలిపారు. ప్రీతి శుక్లా, మాధవ్ కోనేరు లు అసోసియేషన్ ను  కబ్జాలోకి తీసుకున్నారని.. లాక్ డౌన్ సమయంలో ఇది జరిగిందన్నారు. కమిటీ బాధ తట్టులోలేక మూడు కుటుంబాలు వేరే చోటుకు పారిపోయాయి..ప్రాజెక్టు లో ఇపుడు మార్పులు చేస్తున్నారని తెలిపారు.

ఇందులో హీరో సుదీప్ కూడా బాధితుడు అని..ఎవరయినా అడ్డుకోవడానికి వస్తే, అందరి ప్రాణాలను రిస్క్ చేస్తున్నారని మండిపడ్డారు..జీహెచ్ఎంసిని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. డబ్బుల కోసం మాఫియా నడుపుతున్నారని..ఫైర్ స్పేస్ లేకుండా బాల్కానిలు కూడా మూసేస్తున్నారన్నారు. B2714 లో యాక్టర్ కన్నడ హీరో సుదీప్ ఉంటారు,ఆ ఫ్లాట్ ను కూడా ప్లాన్ కు విరుద్ధంగా కడుతున్నారని పేర్కొన్నారు.. ఇందులో సుదీప్ కు రెండు ఫ్లాట్ లు ఉన్నాయని…ఫ్లాట్ లో జరుగుతున్న అక్రమ కట్టడాలు వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు..