ఆమెకు అలాంటి సీన్లు చూసీచూసీ బోర్‌ కొట్టిందట!

-

నమిత. సింహ సినిమాలో ‘సింహమంటి చిన్నోడే.. వేటకొచ్చాడే..!’ అంటూ బాలకృష్ణతో కలిసి స్టెప్పులేసిన ఈ బొద్దుగుమ్మ.. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా తెలుగు ప్రేక్షకుల్లో తనందంటూ ఒక చెరగని ముద్రవేసింది. మరి ఇప్పుడు ఈ అమ్మడు ఎందుకు గుర్తుకొచ్చిందంటారా..? ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ కొన్ని హాట్‌ కామెంట్స్‌ చేసిందట. తనకు ఆ రకం సీన్లు చూసీచూసీ బోర్‌కొట్టిందని చెప్పిందట.

Namitha Green Saree Stills Photo Gallery

ఇంతకూ ఈ హాట్‌ బ్యూటీకి బోర్‌ కొట్టిన ఆ సీన్లు ఏవో తెలుసా..? రోమాంటిక్‌ సీన్‌లేనట! సోమవారం చెన్నైలోని ఓ కాలేజీలో జరిగిన ‘కాక్‌టెయిల్‌’ మూవీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఈ బొద్దుగుమ్మ.. సినిమాల్లో రొమాంటిక్‌ సీన్లు చూసీచూసీ తనకు బోర్‌కొట్టిందని వ్యాఖ్యలు చేసిందట. అంతేకాదు నేటి ప్రేక్షకుల మనసుల్లో ఏముందో కూడా ఈ ముద్దుగుమ్మ కనిపెట్టేసిందట. ఇప్పటి ప్రేక్షకులు రొమాంటిక్‌ సినమాల కంటే కామెడీ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారని తేల్చి చెప్పిందట.

స్టార్‌ హీరో వెంకటేష్‌తో ‘జెమిని’ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఈవీవీ పెద్దకొడుకు ఆర్యన్‌ రాజేష్‌తో ‘సొంతం’ సినిమా చేసి మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌కు జంపయ్యింది. అక్కడ రకరకాల పాత్రలతో తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇదిలావుంటే.. ఈ ‘కాక్‌టెయిల్‌’ మూవీలో ఆస్ట్రేలియాకు చెందిన కాక్‌టెయిల్‌ అనే పక్షి ప్రధాన పాత్రలో నటించిందట. అయితే, ఒక పక్షి ప్రధానపాత్రతో సినిమా తీయడం ఇదే మొదటిసారి అని చెప్పుకుంటున్నారు సినీ ప్రేక్షకులు.

Read more RELATED
Recommended to you

Latest news