పాలను రోజుకు ఎన్ని తాగాలో, ఎప్పుడు తాగితే మంచిదో తెలుసా…..?

-

పాలు తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాల వల్ల మనకు సంపూర్ణ పోషణ అందుతుంది. అనేక విటమిన్లు, మినరల్స్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు మనకు లభిస్తాయి. అయితే పాలను తాగడంలో చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాలు రోజుకు ఎంత మోతాదులో తాగాలి ?
కేవలం పాలు మాత్రమే తాగేట్లయితే రోజుకు 250 ఎంఎల్‌ మోతాదులో తాగితే సరిపోతుంది. అదే పెరుగు, నెయ్యి, పన్నీర్‌ లాంటి పాల సంబంధ ఉత్పత్తులను కూడా రోజూ తీసుకుంటుంటే 100 నుంచి 150 ఎంఎల్‌ మోతాదులో పాలను తాగితే చాలు.

2. పాలు ఎప్పుడు తాగాలి ?
చాలా మంది ఉదయాన్నే పాలు తాగితే కొందరు సాయంత్రం, ఇంకొందరు రాత్రి పూట తాగుతారు. అయితే అసలు పాలను రాత్రి పూట తాగితేనే చాలా మంచిది. దీని వల్ల చక్కని నిద్ర వస్తుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.

3. కొవ్వు ఉన్న పాలు మంచివా, లేనివా ?
కొవ్వు తీసేసిన పాలలో కొన్ని రకాల విటమిన్లు ఉండవు. అందువల్ల కొవ్వు ఉన్న పాలనే తాగితే మంచిది. అదే బరువు తగ్గాలనుకునే వారు అయితే కొవ్వు తీసేసిన పాలను తాగాలి. ఇతరులు నిర్భయంగా కొవ్వు ఉన్న పాలను తాగవచ్చు. అయితే బాగా మరిగించాకే పాలను తాగాలి.

4. ప్యాకెట్‌ పాలను బాగా మరిగించరాదా ?
అవును, ప్యాకెట్‌ పాలను బాగా మరిగించకూడదు. ఎందుకంటే వాటిని మరిగించాకే కూల్‌ చేసి ప్యాకెట్లలో నింపుతారు. కనుక పాలను బాగా మరిగించరాదు. బాగా మరిగిస్తే ఆ పాలలో ఉండే కాసిన్ని పోషకాలు కూడా నశిస్తాయి. కానీ మరి పాలు చల్లగా ఉంటాయి కదా.. అంటే.. గోరు వెచ్చగా అయ్యేంత వరకు మరిగించి వాడుకోవాలి. అంతే కానీ బాగా మరిగించరాదు.

5. పాలను ఎలాంటి పాత్రల్లో నిల్వ చేయాలి ?
పాలను ప్లాస్టిక్‌ పాత్రల్లో నిల్వ ఉంచరాదు. స్టీల్‌ పాత్రల్లో మరిగించాలి. గ్లాస్‌ పాత్రల్లో నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లోనూ ఎక్కువ కాలం ఉంచరాదు. త్వరగా ఉపయోగించాలి. లేదంటే పాలల్లో ఉండే పోషకాలు నశిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news