మహిళలు మందు తాగితే.. తప్పేముంది : పాయల్ సంచలన వ్యాఖ్యలు

-

పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫిల్మ్ తో పాయల్ కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. బోల్డ్ రోల్ ప్లే చేసి మంచి మార్కులు కొట్టయేడంతో పాటు తనలోని అందాలను ఆరబోసి మెస్మరైజ్ చేసింది. అయితే, ఈ భామకు RX100 మూవీ తర్వాత ఆ రేంజ్ లో సరైన హిట్ అయితే పడలేదు. ఈ క్రమంలోనే పాయల్ పాప.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్ గా ముందుకు సాగుతున్నది.

ఇది ఇలా ఉండగా.. ఇటీవల నటి పాయల్ లిక్కర్ బ్రాండ్ ప్రమోషన్ పై విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదంపై స్పందించిన పాయల్. లిక్కర్ బ్రాండ్ నువ్వు పురుషులు ప్రమోట్ చేస్తే ఎందుకు జడ్జ్ చేయరని ప్రశ్నించింది. కాలం వేగంగా మారుతున్నా.. కొంత మందిలో మార్పు రావడం లేదని, అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను చిన్నచూపు చూడటం ఆపాలని కోరారు. పురుషుల అలాగే స్త్రీలు కూడా సరదాగా మద్యం సేవించడం తప్పుకాదని ఈ బ్యూటీ హాట్ కామెంట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version