Pooja Hegde: తొలిసారి సొంత గ‌ళాన్ని వినిపిన‌ బుట్టుబొమ్మ..

-

Pooja Hegde: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర‌లేని పేరు పూజా హెగ్డే. అభిమానుల మ‌దిలో బుట్టబొమ్మ‌గా స్థానం సంపాదించుకుంది. ఇప్ప‌టికే తెలుగులో టాప్ హీరోల స‌ర‌స‌న నటించి.. మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ అందాల తార ఇటు తెలుగులోనే కాగా.. తమిళం, హిందీ భాషల్లోనూ వరుస ఆఫర్ల‌ను కొట్టేస్తూ.. టాప్ గేర్ లో దూసుక‌పోతుంది.

అయితే.. ఈ బుట్ట‌బొమ్మ మ‌రో అరుదైన ప్ర‌య‌త్నం చేస్తుంది. తాను న‌టించే పాత్ర‌కు మ‌రింత స‌హ‌జ‌త్వం తేవ‌డం కోసం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమా లో పూజాహెగ్డే సొంతంగా డబ్బింగ్‌ చెబుతోంది. ఈ బుట్టబొమ్మ డబ్బింగ్ చెప్తున్న ఫోటోను ఆ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ అమ్మ‌డు తెలుగులో చాలా చ‌క్క‌గా , స్ప‌ష్టంగా మాట్లాడుతుంద‌ని టాలీవుడ్‌లో టాక్

రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఆమె నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్‌ అక్కినేని హీరోగా న‌టిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు, వాసువర్మ నిర్మిస్తున్నారు. ఇందులో ఆమని, మురళీశర్మ, జయప్రకాష్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 8న విడుద‌ల కానున్న‌ది. ప్రస్తుతం ఈ భామ.. ప్రభాస్ హీరోగా తెర‌కెక్కుతున్న‌ రాధేశ్యామ్’లో నటిస్తోంది. వీటితోపాటు మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా పూజా హేగ్డే నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news