“నాగిని సాంగ్” పై స్టెప్పులతో రెచ్చిపోయిన నటి ప్రగతి

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. అత్త, తల్లి పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు సంపాదించడం తో పాటు సోషల్ మీడియాలో కూడా నటి ప్రగతి కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రగతి సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో పాటు వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కుర్రాళ్ళు ప్రగతి అంటే పడి చచ్చిపోతారు. కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రగతి సినిమా సెట్స్ లోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా.. నటి ప్రగతి నాగిని సాంగ్ పై స్టెప్పులేసింది. ఇవాళ జిమ్ కు వెళ్లిన నటి ప్రగతి… ఊర మాస్ స్టెప్పులతో… అందరినీ అలరించింది. ఆ డాన్స్ కు సంబంధించిన వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ప్రగతి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/pragstrong/reel/CXeNwwSDOm2/?utm_medium=copy_link