ఎల్లుండి విశాఖకు సీఎం జగన్..

విశాఖ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నెల 17వ తేదీన విశాఖ రానున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 17 వ తేది సాయంత్రం ఐదు గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు కు చేరుకోనున్నారు సిఎం జగన్. ఎన్ ఏ డి జంక్షన్ కు చేరుకొని నూతనంగా నిర్మించిన ఎన్ ఏ డి ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

jagan
jagan

అనంతరం బీచ్ రోడ్ లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో విజయనగరం డి సి సి బి చైర్మన్ కుమార్తె వివాహ కార్యక్రమంకు హాజరుకానున్నారు జగన్. బీచ్ రోడ్డు లోని వుడా పార్కు ను ప్రారంభించనున్నారు సీఎం జగన్. అక్కడ నుంచి పీఎం పాలెం లోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ లో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనమరాలు రిసెప్షన్ కు హాజరుకానున్నారు. తిరిగి రాత్రి 7.55 నిమిషాలకు విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.