అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరవాత దారుణాలకు పాల్పడటం ప్రారంభించారు. అయితే ముఖ్యంగా తాలిబన్లు మహిళలపై వివక్ష చూపుతారని మహిళలకు రక్షణ కరువైనట్టే అని ఆఫ్గన్ మహిళలు ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ లో అదే జరుగుతోంది. మహిళలను తాలిబన్లు ఆఫీసులకు వెళ్లనివ్వడం లేదు. ఆంక్షలు విధిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆఫ్గన్ బాలికలను సైతం తాలిబన్లు స్కూలుకు వెళ్లద్దంటూ ఆంక్షలు విధించారు. అయితే బాలికలు రాకుంటే తాము కూడా స్కూలుకు వెళ్లమని ఆఫ్గన్ బాలురు చెబుతున్నారు. సమాజంలో బాలికలు కూడా సగ భాగమని వారు రాకుండా స్కూలుకు వెళ్లేది లేదని మంకుపట్టుపడుతున్నారు. ఇక దీనిపై స్పందించిన తాలిబన్ల అధికార ప్రతినిధి జబీనుల్లా త్వరలోనే సెకండరీ స్కూల్ విద్యార్థినులను స్కూలుకు అనుమతిస్తామని చెప్పారు.