కృష్ణ జలాలు వాటాలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏపీతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. ఎస్సెల్బీసీ ప్రాజెక్టు కట్టకుండా జాప్యం చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.
అయితే కృష్ణ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వేలెత్తి చూపింది మేమే. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారు.. ఇగ ఆ పార్టీ యాడుంది అని ప్రశ్నించారు బండి. ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ చీకటి మిత్రులు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ రేస్ కేసులు ఏమయ్యాయి. ఢిల్లీకి పోయి కాంప్రమైజ్ అయిన మాట నిజం కాదా.. చెప్పండి. మాపై కేసులు పెట్టొద్దు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని అడ్డుకుందామని కేసీఆర్ ప్రతిపాదించారు. అందుకే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేందుకే అభ్యర్థులను నిలబెట్టకుండా కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు అని బండి పేర్కొన్నారు.