కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దం : బండి సంజయ్

-

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దం. ఈసారి కేంద్ర బడ్జెట్ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించాం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో? ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు మేం సిద్దం. ట్యాక్స్ డివల్యూషన్ రూపంలో 29 వేల 899 కోట్ల రూపాయలు కేటాయించినం. గత ఏడాదితో పోలిస్తే 10 శాతం నిధులు పెంచినం. గ్రాంట్ల రూపంలో 21 వేల 75 కోట్లు కేటాయించినం.

రైల్వేల అభివృద్ధికి 5 వేల 336 కోట్లు కేటాయించినం. యూపీఏ హయాంతో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అభివృద్ధి కోసం ఈ ఏడాది బడ్జెట్ లో తెలంగాణకు 2 వేల 500 కోట్ల మేరకు రుణాలివ్వబోతున్నం. తెలంగాణలో రోడ్లు, రైళ్లు, విమానయాన రంగాల అభివ్రుద్ది కోసం 28 వేల 302 కోట్లు కేటాయించినం. జాతీయ రహదారుల విస్తరణ కోసం 15 వేల,640 కోట్లు కేటాయించినం. తెలంగాణలోని విద్యుత్, ఇంధన, నీటిపారుదల రంగాల అభివ్రుద్ది కోసం 10 వేల 285 కోట్లు కేటాయించినం. విద్యా, క్రీడా రంగాల అభివ్రుద్ధి కోసం ఈ ఏడాది 4 వేల 930 కోట్లు ఖర్చు చేయబోతున్నం. దేశానికి సంబందించిన బడ్జెట్ లో ఒక రాష్ట్రం పేరు లేనంత మాత్రాన ఆ రాష్ట్రానికి నిధులివ్వలేదని సరికాదు అని బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news