YCP నేత బొత్స సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేసారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది అని షర్మిల అన్నారు. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు అన్నారు. 5 ఏళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారు. అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారు.
పార్టీ పాలసీకి, తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీకి దత్తపుత్రుడిగా మారారు. ప్రజల సంపదను ప్యాలెస్ కి మళ్లించుకున్నారు. 5 ఏళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారు. పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారు అని షర్మిల పేర్కొన్నారు.