నన్ను ఓడించేందుకు ఎన్నో జీవోలు తెచ్చారు : మంత్రి సీతక్క

-

సిర్పూర్ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు పై స్పందించిన మంత్రి సీతక్క.. కొంత మంది మనస్సు ఏటో ఉంది. వాళ్ల మనసులో కొంత అటు ఇటుగా ఉంది. వాళ్లు ఎటువైపో తేల్చుకున్నాక మాట్లాడాలి అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు రద్దు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఎన్నో జీవోలు తీసుకొచ్చారు. అవసరం, సాధ్యాసాద్యాలని బట్టి మళ్ళీ ఇస్తాం.

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి పనులు చేయలేదు. కానీ ఎన్నికలు ఓట్ల సమయంలో మాత్రమే అనేక జీవోలు ఇచ్చారు. నన్ను ఓడించేందుకు సైతం ములుగులో ఎన్నో జీవోలు తెచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పనులు చేస్తుంది. ప్రాణహిత పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాము. మనస్సు పెట్టి చూస్తే అర్థం అవుతుంది అన్నారు. ఇక సమావేశంకు దూరంగా ఉన్న నేతలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి సీతక్క.. మేము అందరు నాయకులకు ఆహ్వానం ఇచ్చాము పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news