కంగారూలను బెంబేలేత్తిస్తున్న ఆఫ్ఘన్ బౌలర్లు… 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా !

-

ఈ రోజు ముంబైలో ఆస్ట్రేలియా మరియు ఆఫ్గనిస్తాన్ ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హస్మదుల్లా సేన 5 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. అనంతరం 292 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా తడబడుతూనే ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లు మొదటి నుండి చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా ను వణికిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 14 ఓవర్లు ముగిసే సరికి 4 కీలక వికెట్లు కోల్పోయి 69 పరుగులు మాత్రమే చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీన్ ఉల్ హాక్ మరియు ఒమర్ జై లు తలో రెండు వికెట్లు తీసి కంగారూలను దెబ్బ తీశారు. ఇక ఆస్ట్రేలియా లో వార్నర్ (18), హెడ్ (0), మార్ష్ (24), జోష్ ఇంగ్లిష్ (0) మరియు లాబుచెన్ (14) లు అవుట్ అయ్యి పెవిలియన్ చేరారు.

ఇంకా 200 కు పైగా పరుగులు చేయాల్సిన తరుణంలో ఏ విధంగా ఆడుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇంతవరకు బాగా ఆడిన ఆస్ట్రేలియా ఆఫ్ఘన్ తో మాత్రం పూర్తిగా చతికిలబడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news