ముస్లిం మతంలో చాలా కారణమైన నియమ నిబంధనలు ఉన్నాయి. కొన్ని దేశాలలో అన్ని నియమ నిబంధనలపై చూసి చూడకుండా పోయినా, మరికొన్ని దేశాలలో అయితే ముస్లిం ప్రజలు ఖచ్చితంగా అన్ని నియమ నిబంధనలను పాటించాల్సిందే.. లేదంటే కఠినమైన శిక్షలు అమలుచేస్తూ ఉన్నాయి. ఇక తాజాగా ఆఫ్గనిస్తాన్ హిజాబ్ ధరించడం అనే విషయంలో కఠినమైన నిర్ణయాలను తీసుకుని ఆదేశ ముస్లిం మహిళలు షాక్ ఇచ్చిందని చెప్పాలి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆఫ్గనిస్తాన్ లో ఉన్న తాలిబన్ ప్రభుత్వం ఎవరైతే మహిళలు హిజాబ్ ను ధరించరో వారికి జాతీయ పార్కు లలోకి అనుమతి ఉండదు అంటూ తేల్చి చెప్పింది. తాలిబన్ లు చెబుతున్న ప్రకారం ఇంటి నుండి బయటకు వస్తున్న మహిళలు ఇస్లామిక్ నిబంధలను పాటించకపోవడం వలనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట.
అయితే తాలిబన్ల ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కఠిన నిర్ణయాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు మరియు వ్యతిరేకత వ్యక్తమవుతోంది.