200 కోట్ల బిజినెస్ అయి కూడా చిక్కుల్లో పడ్డ స్టార్ హీరో …?

-

కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ క్రేజ్ ఉన్న హీరో “తలపతి” విజయ్. దాదాపు అరవై సినిమాలకి పైగా నటించిన విజయ్.. రజనీకాంత్ కి గట్టి పోటీగా నిలబడ్డాడు. అంతేకాదు ప్రస్తుతం కోలీవుడ్ లో ఉన్న సూపర్ స్టార్ హీరోలలో సూర్య, కార్తి, అజిత్, ధనుష్ కంటే విజయ్ మార్కెట్ ఎక్కువ. ఎంతమంది పోటీ ఉన్నా విజయ్ కి ఫాన్స్ లో గాని తమిళ ప్రేక్షకుల్లో గాని ఫాలోయింగ్, క్రేజ్ విపరీతం. ఇక తమిళంలో విజయ్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కి పండగ. వీళ్ళు చేసే హంగామా అంతా ఇంతా కాదు. రజనీకాంత్ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి వాతావరణం నెలకొంటుందో విజయ్ సినిమా రిలీజవుతుంటే కూడా అలాంటి వాతావరణం నెలకొంటుంది.

 

గత రెండు మూడేళ్ళుగా వరస విజయాలతో కోలీవుడ్ లో విజయ్ మార్కెట్ బాగా పెరిగింది. ఆయన నటించిన సినిమాలన్నీ కోలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఇక విజయ్ నటించిన కత్తి సినిమాతోనే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన 150 సినిమాని ఖైదీ నంబర్ 150 గా రూపొందించి సూపర్ హిట్ ని అందుకున్నారు. ఇక విజయ్ కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను మంచి క్రేజ్ ఉందన్న విజయ్ అందరికీ తెలిసందే. తమిళంలో రిలీజైన సినిమాలు ఇక్కడ కూడా రిలీజై మంచి వసూళ్ళని సాధిస్తున్నాయి. విజయ్ గత చిత్రాలు జిల్లా, పోలీస్, ఏజెంట్ భైరవ, అదిరింది, సర్కార్ గా తెలుగులో డబ్ అయి మంచి సక్సస్ ని అందుకున్నాయి.

ఇక విజయ్ తాజా చిత్రం మాస్టర్. లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించాడు. మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా పై తమిళ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే 200 కోట్ల బిజినెస్ అయిన ఈ సినిమా ఏప్రిల్ రెండవ వారం లోనే రిలీజ్ కావాల్సింది. కాని కరోనా నేపథ్యంలో చెన్నై మొత్తం లాక్ డౌన్ విధించారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని విజయ్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పటికే అయిన 200 కోట్ల బిజినెస్ తారుమారు అవుతుంతా అని మేకర్స్ టెన్షన్ పడుతున్నారట. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని భయపడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news