ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిల్లై కస్టడీ మరి కాసేపట్లో ముగియనుంది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రామచంద్ర పెళ్లై తన వాంగ్మూలంలో తాను ఎమ్మెల్సీ కవితకి బినామీన అని చెప్పారు. అలాగే ఆమె చెప్పినందుకే తన ఖాతాలోకి రూ. 32 కోట్లు వచ్చాయని ఈడీ విచారణలో తెలిపారు రామచంద్ర పిల్లై.
అలాగే ఒక కోటి రూపాయలు సైతం ఆయన సొంత అకౌంట్ లో పడ్డాయని చెప్పుకొచ్చారు. అనంతరం ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు రామచంద్ర. అయితే నేడు ఎమ్మెల్సీ కవితని, ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురిని ఒకేసారి విచారణ చేపట్టాలని ఈడి నిర్ణయించినప్పటికీ.. కవిత విచారణకి హాజరు కాలేదు. మరోవైపు నేడు రామచంద్ర పిల్లై కస్టడీ ముగిసింది. దీంతో ఆయన కస్టడీ నీ పొడగిస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.