బిజినెస్ లోనూ నెం.1 ఆలియా.. ఏడాదికి ఎన్ని కోట్లు సంపాదిస్తుందంటే!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కు సినీ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామర్ రోల్స్ తో పాటు పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తుంది ఈ భామ. అయితే కేవలం సినిమాలతోనే కాకుండా బిజినెస్ లో సైతం ఆలియా తనదైన ముద్ర వేస్తున్నట్టు ఏడాదికి వందల కోట్లు సంపాదిస్తుందని సమాచారం.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆలియా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే హీరో రన్బీర్ కపూర్ ను పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇటు కెరీర్ను అటు పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నా ఆలియా.. కేవలం నాటిగా మాత్రమే కాకుండా ఓ బిజినెస్ మాన్ గా కూడా సక్సెస్ఫుల్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఒక సినిమాకు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ భామ వ్యాపార రంగంలో ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.

అలియా భట్ గర్భిణీగా ఉన్న సమయంలోనే చిన్నారులకు సంబంధించిన ఎడ్ ఎ మామ పేరిట ఓ ఆన్లైన్ స్టోర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. రెండేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల దుస్తులు ఈ స్టోర్ లో దొరుకుతాయి. అంతేకాకుండా వీరికి సంబంధించిన ఎనిమిది వందల రకాల వస్తువులు సైతం ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. మొదలుపెట్టిన కొంత కాలంలోనే ఈ స్టోర్ కోట్లలో లాభాలు గడించి ఇప్పటికి సక్సెస్ఫుల్ బాటలో కొనసాగుతుంది. మొదలుపెట్టిన ఏడాది లోపలే ఈ కంపెనీ విలువ 150 కోట్లు దాటేసినట్టు తెలుస్తోంది. కేవలం ఒక్క ఏడాదిలోనే పెట్టుబడికి 10 రెట్లు సంపాదించినట్టు కూడా సమాచారం. ఈ స్టోర్ తో పాటు అలియా భట్ నూనెలు, అగర్బత్తులకు సంబంధించిన నైకా, ఫుల్ కో, స్టైల్ క్రాకర్ వంటి పలు విజయవంతమైన సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఇంత సక్సెస్ ఫుల్ గా కెరియర్ను నడిపిస్తుంది కాబట్టే ఇప్పటికే రన్బీర్ కపూర్ నా భార్య మంచి నటి అందగత్తె మాత్రమే కాకుండా సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అంటూ కూడా పొగిడేస్తూ ఉంటారు

Read more RELATED
Recommended to you

Latest news