నిన్న కమెడియన్..ఈరోజు భర్త కూడా అరెస్ట్

నిన్న బాలీవుడ్ లేడీ కమెడియన్ భారతి సింగ్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక భారతి సింగ్ భర్త హర్ష్ లింబాచియాను కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు 15 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేశారు. తన భార్యను శనివారం అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

శనివారం ఉదయం వీరి ఇంటిని రైడ్ చేస్తున్న సమయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు “చిన్న మొత్తంలో గంజాయి” ను స్వాధీనం చేసుకున్న తర్వాత భారతి సింగ్ మరియు ఆమె భర్త హర్ష్ లింబాచియాను ఎన్‌సిబి ముంబై కార్యాలయానికి తరలించారు. “మాదకద్రవ్యాల పదార్థాలను కలిగి ఉండటంతో వారిని ప్రశ్నించిన తర్వాత ఆమెను ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు” అని దర్యాప్తు అధికారులలో ఒకరైన సమీర్ వాంఖడే పేర్కొన్నారు.