రామ్ చరణ్ ను చూసిన వెంటనే జైశ్రీరామ్ అని అరిచిన నార్త్ ఫ్యాన్స్ !

-

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమా క్లైమాక్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని నిమిషాల పాటు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు.అయితే నార్త్ ఫ్యాన్స్ మాత్రం క్లైమాక్స్ లో శ్రీరాముడిగా రామ్ చరణ్ కనిపించారని భావించారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ హిందీలో అంచనాలను మించి హిట్ కావడానికి రామ్ చరణ్ లుక్ కూడా ఒక కారణం.

రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన జంటగా హాజరయ్యారు. చరణ్ ను చూసిన ఆనందంలో అక్కడ ఫ్యాన్స్ జై శ్రీరామ్ అంటూ కామెంట్లు చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.రామ్ చరణ్ ను చూసి అలా కామెంట్లు చేయడంతో ఉపాసన అనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ గౌరవం చరణ్ కు దక్కిన అరుదైన గౌరవం అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే…రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా లో నటిస్తున్నాడు. దర్శకుడు శంకర్ ఈ సినిమాన్ని తెరకెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news