పగోజిల్లాలో మళ్ళీ వింత వ్యాధి..అధికారులు ఏమంటున్నారంటే ?

-

పశ్చిమ గోదావరి జిల్లాలో మరో మారు వింత వ్యాధి కలకలం రేపుతోంది. రెండ్రోజుల నుంచి కొన్ని గ్రామాల ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారని అంటున్నారు.  వీరిలో కొందరికి మూర్ఛ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. బాధితులు ఉన్న వారు ఉన్నట్లే కింద పడిపోతున్నారని చెబుతున్నారు. పూళ్ల పడమర యస్సి కాలనీలో బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ప్రస్తుతం పూళ్ళలో ప్రమాదకరంగా పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.

నిన్నటి నుంచి ఇప్పటి వరకు 15 మంది కళ్ళు తిరిగి పడిపోయారని, అయితే యా 15 మంది ఆరోగ్యం బాగానే ఉంది అందరూ డిశ్చార్జ్ అయ్యారని చెబుతున్నారు. కొంత మందిని భీమడోలు ఆసుపత్రికి పంపించామని అందరూ రికవరీ అయ్యారని చెబుతున్నారు. గ్రామంలో 5 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని క్యాంప్ లో ఒక మెడికల్ ఆఫీసర్ అపాయింట్ చేశామని అన్నారు. వాటర్ టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపాము రిపోర్ట్  రావాలని అన్నారు.  క్లోరినేషన్తో పాటు పరిసరాల పరిశుభ్రత చేయాలని అధికారులకు సూచించామని డిఎంహెచ్ఓ సునంద పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news