మళ్లీ ఆగిన భారత్-పాక్‌ మ్యాచ్‌.. సాగేనా..?

-

ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్‌- ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి మరోసారి అంతరాయం కలిగింది. వాన వల్ల ఆట నిలిచే సమయానికి 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది పాకిస్తాన్. పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పాక్‌ స్కోరు 44/2. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లు అదరగొట్టారు. విరాట్ కోహ్లీ (122*), కేఎల్ రాహుల్ (111*) సెంచరీలు సాధించారు. మూడో వికెట్‌కు ఆసియా కప్‌లోనే అత్యధికంగా 233 పరుగులు జోడించారు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 356/2 స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (56), శుభ్‌మన్‌ గిల్ (58) హాఫ్ సెంచరీలు చేశారు. పాక్‌పై భారత్‌కు ఇది అత్యుత్తమ స్కోరు కావడం విశేషం.

24 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన బాబర్ ఆజమ్‌ని హార్ధిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. 43 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. ఓపెనర్ ఫకార్ జమాన్ 22 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 2 బంతుల్లో 1 పరుగు చేసి క్రీజులో ఉన్నారు.. మొదటి 11 ఓవర్లలోనే రెండు డీఆర్‌ఎస్ రివ్యూలను వాడేసింది భారత జట్టు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫకార్ జమాన్ వికెట్ కోసం రివ్యూ కోరింది టీమిండియా. అయితే టీవీ రిప్లైలో బంతి అవుట్ సైడ్ పిచ్ అవుతున్నట్టు కనిపించింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version