పాస్ అడిగినందుకు హోం గార్డ్ తో గుంజీలు…!

-

లాక్ డౌన్ ని దేశ వ్యాప్తంగా చాలా కఠినం గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలను బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసినా సరే ఎవరూ కూడా వినడం లేదు. దీనితో ఇప్పుడు పోలీసులు శిక్షలు వేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు మనం చూసాం. కాని తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. లాక్ డౌన్ కట్టడి చేసే హోం గార్డ్ ని ఒక అధికారి గుంజీలు తీయించడం ఆశ్చర్యం కలిగించింది.

వివరాల్లోకి వెళితే బిహర్‌లో అరారియా జిల్లాలో పాట్నాకు 320 కిలోమీటర్ల దూరంలో ఒక చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలో భాగంగా ఒక అధికారి కారుని ఆపి చెక్ చేసారు. కారులో ఉన్న ఒక వ్యక్తి తాను వ్యవసాయ శాఖ అధికారి అని చెప్పారు. కాని అనుమానంతో హోం గార్డ్ కార్లో వ్యక్తిని పాస్ చూపించాలి అని కోరాడు. దీనితో కారులో ఉన్న వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేసాడు. హోం గార్డ్ తో గొడవకు దిగారు.

ఇక్కడ జరిగిన వింత సంఘటన ఏంటీ అంటే… పాస్ అడిగినందుకు హోం గార్డ్ కి శిక్ష వేసారు. చేతులు కట్టుకొని హోంగార్డుతో గుంజీలు తీయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలోఈ సంఘటన మొత్తం ఉంటుంది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news