వకీల్ సాబ్ ఆగస్టులో రావడం కష్టమేనట …?

-

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వేణు శ్రీరాం తెరకెక్కిస్తున్న ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్ పతాకం పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రెండు భాషల్లో హిట్ అయినా ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

 

ఇక ఈ సినిమా కి సంధించిన కొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ ని దర్శకుడు వేణు శ్రీరాం వెల్లడించారు. ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ శృతిహాసన్ మీద ఒక రొమాంటిక్ సాంగ్ తో పాటు కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉందని మొత్తం మీద ఈ సినిమాకి నెల రోజులపాటు వర్క్ చేయాల్సి ఉందని తెలిపారు. లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్ వర్క్ కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనడం కూడా చాలా ఆసక్తిని కలిగించిందని పగలంతా రాజకీయాల పనుల్లో బిజీగా ఉండి కూడా రాత్రిళ్ళు చాలా ఉత్సాహంగా షూటింగ్ లో పని చేశారని తెలిపాడు.

అయితే ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ చేసేందుకు అన్ని విధాలా కార్యాచరణ చేస్తున్నప్పటికి నెల రోజులు పాటు బ్యాలెన్స్ వర్క్, కరోనా ఎఫెక్ట్ తో ఆ సమయానికి సినిమా రెడీ అవుతుందా అన్నది ఇంకా క్లారిటీ లేదని తెలుస్తుంది. ఒకవెళ ఆగస్టు రెండవవారం లో సినిమా రిలీజ్ ఉంటుందని అంటున్నారు. అప్పుడు గనక మిస్ అయితే మళ్ళీ అక్టోబర్ లోనే రిలీజ్ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news