అతి తీవ్రమైన రోగాల బారిన పడిన వారు ఇప్పుడు కరోనా నుంచి బయటపడటం అనేది చాలా తక్కువ అని వస్తే ప్రాణాలు కోల్పోవడమే అనే హెచ్చరికలు ఇప్పుడు వినపడుతున్నాయి. అందుకే రోగాలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎయిడ్స్ క్యాన్సర్ సహా కొన్ని రోగాలు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడటం మంచిది అని సూచి౦చింది. ఇక ప్రపంచంలో ఇతర రోగాలు ఉన్న వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఒక ఎయిడ్స్ పేషెంట్ మాత్రం కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అవును మీరు చదివింది నిజం… అది కూడా రోగ నిరోధక శక్తి మీద దెబ్బ కొడుతుంది కదా ఎలా కోలుకున్నాడా అంటారా…? కాని అతను కేవలం ఆరు రోజుల్లోనే బయటపడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు దిల్లీ నుంచి స్వస్థలమైన గోండాకు వెళ్ళాడు. మార్గ మధ్యలో ఒక భారీ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో అతని తలకు భారీ గాయం అయింది. వెంటనే లక్నోలోని కేజీఎంయూ ఆస్పత్రికి వైద్యులు తీసుకెళ్ళారు. తాను అప్పటికే హెచ్‌ఐవీ మందులు వాడుతున్నా అని చికిత్స సమయంలో చెప్పాడు అతను. ఇక ఆ తర్వాత చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో అతనికి రెండు చికిత్సలు చేసారు వైద్యులు. తలకు బలమైన గాయం అయినా సరే అతను ఎక్కడా కంగారు పడలేదు అని, అతని శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా బలంగా ఉందని, ఎయిడ్స్ తీవ్రత కూడా అతనికి అంతగా లేదని వెంటనే కోలుకున్నాడు అని ఆస్పత్రి వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎం.ఎల్.బి భట్ మీడియాకు వివరించారు.