ప్రస్తుతం కరోనా వైరస్ పోరాటం విషయంలో సానుకూల ఫలితాలను చూపిస్తున్న ఫైజర్ కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారతదేశానికి దానిపై పెద్దగా ఆశలు లేవని నిపుణులు పేర్కొన్నారు. ఫైజర్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ను -70 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచాల్సిన అవసరం ఉందని, అలాంటి లాజిస్టిక్స్ భారతదేశంలో ఏర్పాటు చేయడం కష్టమని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
“ఫైజర్ వ్యాక్సిన్ -70 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచాలి , ఇది భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సవాలుగా ఉంది, ఇక్కడ వింటర్ చైన్ ని నిర్వహించడంలో మాకు ఇబ్బందులు ఎదురవుతాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అని ఆయన చెప్పారు. ఫైజర్ ఇంక్ మరియు బయోఎంటెక్ తమ కరోనా వైరస్ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ పై ప్రపంచం చాలా ఆశలు పెట్టుకుంది.