తయారీ రంగానికి కేంద్రం భారీ ప్యాకేజ్

-

కేంద్ర క్యాబినెట్ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. తయారీ రంగానికి రెండు లక్షల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్పత్తి ఆధారిత కంపెనీలకు ఇన్సెంటివ్స్ ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రి జవదేకర్ ప్రకటించారు. 10 రంగాల్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ ప్యాకేజీ ఆత్మ నిర్భర భారత్ కు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

తయారీ రంగం అభివృద్ధి చెందినప్పుడే ఆత్మ నిర్భర భారత్ కల నిజమవుతుందని అన్నారు. ఆటోమొబైల్స్ మరియు ఆటో కాంపోనెంట్స్, ఫార్మాస్యూటికల్స్ డ్రగ్స్, స్పెషాలిటీ స్టీల్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ ప్రొడక్ట్స్, వైట్ గూడ్స్ (ఎసిలు మరియు ఎల్‌ఇడిలు), టెలికాం మరియు నెట్‌వర్కింగ్ ఉత్పత్తులు, వస్త్రాలు, అధిక సామర్థ్యం గల సౌర పివి గుణకాలు మరియు అధునాతన బ్యాటరీల ఉత్పత్తి రంగాలకి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ప్రైవేటు రంగంలో వృద్ధిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అంతకుముందు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆధ్వర్యంలో కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news