మాంసాహారం సర్వ్‌ చేసినందుకు 47 వేలు ఫైన్‌.. ఎక్క‌డో తెలుసా..

-

ఇప్ప‌టికే భారీ క‌ష్టాల్లో ఉన్న ఎయిరిండియాకు మ‌రో త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది. పొర‌పాటును ప్రయాణికుడికి ఒక‌టి స‌ర్వ్ చేయ‌బోయి మ‌రొక‌టి స‌ర్వ్ చేసినందుకు భారీ జ‌రిమానాన్ని ఎదుర్కొంటుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. మొహాలికి చెందిన చంద్రమోహన్‌ పఠాక్‌ భార్యతో కలిసి ఢిల్లీ నుంచి చికాగో వెళ్లేందుకు జూన్‌ 17, 2016లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అంతేకాక అదే ఏడాది నవంబర్‌ 14న రిటర్న్‌ టికెట్లు కూడా బుక్‌ చేసుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే తాము శాఖాహారులమని టికెట్లు బుక్‌ చేసుకునే సమయంలోనే స్పష్టం చేశాడు. అయితే న్యూఢిల్లీ నుంచి షికాగోకు వెళ్లే సమయంలో తమకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అయితే రిట‌ర్న్‌ వచ్చే సమయంలో మాత్రం తమకు వెజిటేరియన్‌కు బదులు నాన్‌వెజ్ సర్వ్ చేశారని ఆరోపించాడు. అదే విధంగా నాన్‌వెజ్ మరియు వెజిటేరియన్ ప్యాకెట్స్‌ను గుర్తు పట్టేందుకు ఎలాంటి గుర్తులు లేక‌పోవ‌డంతో చంద్ర‌మొహ‌న్‌ సిబ్బందిపై మండిప‌డ్డారు.

ఈ క్ర‌మంలోనే సీరియస్ అయిన‌ చంద్రమోహన్ ఢిల్లీలో ల్యాండ్ అవగానే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. చంద్రమోహన్ ఇచ్చిన ఫిర్యాదుతో కన్స్యూమర్ ఫోరం చర్యలు తీసుకుని ప్రయాణికుల మనోభావాలు దెబ్బతీసినందుకు గాను ముందుగా చంద్ర‌మోహ‌న్‌కు రూ.10వేలు ఎయిరిండియా సంస్థకు జరిమానా విధించింది. అంతే కాకుండా లీగల్ ఖర్చుల కింద రూ.7వేలు చెల్లించాలని నోటీసులు పంపింది.

ఎయిరిండియా కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఎయిరిండియాకు ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. కమిషన్‌ జరిమానా మొత్తాన్ని ఏకంగా నాలుగు రెట్లు పెంచి మొత్తం రూ. 47వేలు చెల్లించాల్సిందిగా ఎయిరిండియాకు షాక్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news