టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు నూతన ఆఫర్‌ను అందిస్తోంది. వారు 5జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. కాకపోతే వారు ఇప్పటి వరకు 3జిని మాత్రమే వాడుతూ ఉండాలి. లేదా కొత్త 4జి కస్టమర్ అయి ఉండాలి. 3జి వాడేవారు 4జికి అప్ గ్రేడ్ అయి కొత్త 4జి సిమ్‌ను తీసుకున్నా లేదా కొత్తగా 4జి ప్రీపెయిడ్ సిమ్‌ను తీసుకున్నా వారు ఈ ఆఫర్ కింద 5జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు.
ఇక కస్టమర్లు సిమ్ యాక్టివేట్ అయిన 30 రోజుల్లోగా ఫోన్‌లో ఎయిర్‌టెల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని అందులో ఉండే కూపన్స్ విభాగం ద్వారా మొత్తం 5 కూపన్లు పొందవచ్చు. ఒక్కో కూపన్‌కు 1జీబీ డేటా ఉచితంగా వస్తుంది. దాన్ని 3 రోజుల్లోగా వాడుకోవాల్సి ఉంటుంది. 3 రోజులు దాటితే ఆటోమేటిగ్గా డేటా ఎక్స్‌పైర్ అవుతుంది. ఇక ఆ కూపన్లను 90 రోజుల్లోగా వాడుకోవాల్సి ఉంటుంది. వాడకపోతే ఎక్స్‌పైర్ అవుతాయి. ఇలా కస్టమర్లు ఉచితంగా డేటాను పొందవచ్చు.
కాగా ఎయిర్‌టెల్ పలు ఇతర ప్రీపెయిడ్ ప్లాన్లను రీచార్జి చేసుకున్నా ఉచిత డేటాను అందిస్తోంది. రూ.598 రీచార్జితో 6జీబీ డేటా, రూ.399ఆపైన రీచార్జితో 4జీబీ డేటా, రూ.219 ఆపైన రీచార్జితో 2జీబీ డేటా ఉచితంగా లభిస్తాయి. 1జీబీ ఉచిత డేటా కూపన్ల రూపంలో వాటిని వాడుకోవాలి. 6జీబీ డేటాకు 6 కూపన్లు, 4జీబీ డేటాకు 4, 2జీబ డేటాకు 2 కూపన్లను ఇస్తారు. వాటిని ఎయిర్‌టెల్ యాప్‌లో పొందవచ్చు.