వార్నర్ గాయం ఇంకా పెద్దది అయితే బాగుండు : కేఎల్ రాహుల్

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మొదటి వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్ లలో కూడా ఓటమి చవిచూసింది. అయితే రెండో వన్డే మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం బారిన పడడంతో విలవిలలాడుతూ మైదానాన్ని వీడాడు అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ కాయంపై ఇటీవలే టీమిండియా కీలక ఆటగాడు కె.ఎల్.రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కి అయిన గాయం పెద్దది అయితే బాగుండు అంటూ సోషల్ మీడియా వేదికగా చమత్కరించాడు కె.ఎల్.రాహుల్. సాధారణంగా అయితే ఏ ఆటగాని గాయం విషయంలో గాయం పెద్దది కావాలి అని కోరుకోనని.. కానీ వార్నర్ గాయం పెద్దది కావడం వల్ల కొన్ని మ్యాచ్ లకు దూరం అయ్యే అవకాశం ఉందని.. తద్వారా టీమిండియాకు ఎంతగానో కలిసి వచ్చే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు