సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త టెక్నిక్ తో జనాన్ని దోచడానికి సిద్దం అవుతున్నారు. కొత్త రకం టెక్నిక్స్ తో ఎయిర్ టెల్ వినియోగదారులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ఎయిర్‌టెల్ నెంబర్ బ్లాక్ అవుతుందంటూ కస్టమర్లకు కాల్ చేసి బెదిరిస్తారు. నెంబర్ బ్లాక్ అవుతుందంటూ మెస్సేజ్‌లతో హంగామా చేస్తారు. మెస్సేజ్‌లు చూసి హైరానా పడుతున్న కస్టమర్ లు ఏమి చేయాలో తెలియక భయపడుతున్న సమయంలో నెంబర్ బ్లాక్ కాకుండా ఉండాలంటే ఫోన్ చేయాలంటూ మెసేజ్ పెడతారు.
అలా ఫోన్ చేసిన కస్టమర్లతో ఎనీ డెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేయిస్తున్న ఛీటర్స్, ఎనీ డెస్క్ యాప్ ద్వారా బ్యాంక్, ఆధార్, పాన్ నెంబర్లు తెలుసుకుంటున్నారు. అలా ఎయిర్‌టెల్ కస్టమర్ల బ్యాంకుల్లో డబ్బులు కొట్టేస్తున్నారు నేరగాళ్లు. ఇది భరత్‌పూర్ గ్యాంగ్ దోపిడీ అని భావిస్తున్నారు పోలీసుల. ఎయిర్‌టెల్ కస్టమర్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.