ఉపఎన్నికలో పోటీ పై జానారెడ్డి ప్యూహం వేరే ఉందా

-

నాగర్జున సాగర్ ఉపఎన్నిక ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతుంటే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాత్రం తన వ్యాఖ్యలతో అందరి దృష్టి తనపై పడేలా చేస్తున్నారు. అయితే జానారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక వ్యూహం ఏదైనా ఉందా లేదా పోటీపై మనసు మార్చుకుంటున్నారా అన్న చర్చ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైంది.

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మాజీ మంత్రి జానారెడ్డి కామెంట్స్‌ రోజుకో చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల నాగార్జునసాగర్‌లో జరిగే సమావేశాల్లో పార్టీ నాయకుల ముందు ఉప ఎన్నికల చర్చ వచ్చింది. ఉపఎన్నికలో నన్ను నిలబడమంటే నేను నిలబడతా లేదంటే మా అబ్బాయి రఘువీర్‌ పోటీ చేయమంటే అతను చేస్తారని చెప్పడంతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు పెద్దాయన

కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పటికే నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో పోటీ చేసేది జానారెడ్డే అని ప్రకటించింది. పీసీసీకి కొత్త చీఫ్‌ నియామకం ప్రక్రియ ఫైనల్‌ అయ్యే దశలో ఆయన హైకమాండ్‌కు లేఖ రాశారు. దాంతో నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక అయ్యే వరకు పీసీసీ చీఫ్‌ నియామకం ఆగిపోయింది. ఉపఎన్నిక కోసమే పీసీసీ చీఫ్‌ ఎంపికను వాయిదా వేయించిన జానారెడ్డి.. ఇప్పుడు కొత్త పలుకులు పలకడంతో పార్టీలో చర్చ మొదలైంది.

కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నాగార్జునసాగర్‌లో ఓ సర్వే చేయించింది. జానారెడ్డి బరిలో ఉంటే కాంగ్రెస్‌కి విజాయవకాశాలు ఉంటాయని కాదని ఆయన కుమారుడు రఘువీరరెడ్డిని బరిలో దించితే కాంగ్రెస్‌కు ఇబ్బంది తప్పదని సర్వేలో తేలిందట. దీంతో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు వెళ్లి పోటీకి జానారెడ్డిని ఒప్పించారట. ఆ తర్వాతే పెద్దాయన ముందడుగు వేసినట్టు చెబుతున్నారు. వాస్తవానికి దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత దూకుడుపై ఉన్న బీజేపీ.. జానారెడ్డి కుటుంబంపై కన్నేసింది.

జానారెడ్డి రాకున్నా ఆయన కుమారుడు వచ్చినా ఎన్నికల బరిలోనిలపాలని పావులు కదిపారు కమలనాథులు. టీఆర్‌ఎస్‌ సైతం బలమైన నేత కోసం అన్వేషిస్తూ.. జానా ఇంటిపై ఫోకస్‌ పెట్టింది. అయినా జానారెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. టీఆర్‌ఎస్‌, బీజేపీలు సొంత ప్లానింగ్‌లో పడ్డాయి.

ఇదే సమయంలో నాగార్జునసాగర్‌లో మండలాల వారీగా సమావేశాలు పెడుతోంది కాంగ్రెస్‌ పార్టీ. జానారెడ్డి సైతం అడపా దడపా అక్కడికి వెళ్లి వస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు నేనా.. నా కుమారుడా అని కొత్త పల్లవి అందుకోవడంతోనే అంతా డైలమాలో పడ్డారట. జానారెడ్డి ఏ మాటలు కూడా బాహాటంగా చెప్పరు. కానీ ఇప్పుడు చేస్తున్న ఓపెన్‌ కామెంట్స్‌ మాత్రం పార్టీని గందరగోళంలో పడేస్తున్నాయట. అయితే కాంగ్రెస్‌ నాయకులు మాత్రం.. జానారెడ్డి మాటల వెనక వ్యూహం ఉందని చెబుతున్నారు. నాగార్జునసాగర్‌లో ఎప్పుడూ తండ్రి లేదంటే కుమారుడికేనా అన్న టాక్‌ రాకుండా ఉండేందుకు ఇలాంటి ఎత్తుగడ వేస్తున్నారని చర్చ జరుగుతోంది.

అందుకే అభ్యర్థి ఎంపికలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటున్నట్టు జానారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామన్నది ఆయన వాదన. పార్టీ నాయకత్వంతోపాటు అంతా నన్నే పోటీ చేయాలంటే పోటీ చేస్తా… లేదంటే రఘువీర్‌ని పోటీ చేయించాలని చెప్తే మీ మాట పార్టీ అధిష్ఠానానికి చెప్పి ఒప్పిస్తా.. మేమిద్దరం కాదు.. పార్టీలోనే ఓ సీనియర్‌ని నిలబెడదాం అంటే దానికి కూడా మద్దతిస్తా అని జానారెడ్డి ప్రకటించారట. పార్టీలో అందరిని ఒకే గూటి కిందకు తీసుకురావడానికి జానారెడ్డి ఈ వ్యూహాన్ని అమలు చేశారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news