Ajith Valimai :అజిత్‌ కు విలన్‌ కార్తికేయ.. అదిరిపోయిన “వాలిమై” ట్రైలర్‌

-

తమిళ్‌ హీరో అజిత్‌ కు ఎంతో క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలోనే కాకుండా.. తెలుగు లోనూ హీరో అజిత్‌ కు ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉంది. అయితే.. ప్రస్తుతం… హీరో అజిత్‌ వాలీమై సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు వినోద్‌ దర్శకత్వం వహిస్తుండగా.. బోనీ కపూర్‌ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. అలాగే.. ఈ సినిమా బే వ్యూ ప్రాజెక్ట్స్‌ ఎల్‌ఎల్‌ పీ, జీ స్టూడియోస్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. అజిత్‌ కు విలన్‌ గా టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ నటిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ ట్రైలర్‌ లో హీరో అజిత్‌ యాక్షన్‌ సీన్స్‌ చాలా బ్రహ్మండగా ఉన్నాయి. అలాగే… విలన్‌ గా కార్తికేయ అదరగొట్టాడు. మొత్తానికి ఈ ట్రైలర్‌ సినిమా పై అంచనాలను పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news