ఓమిక్రాన్ కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాాగా పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి కోల్ కతాకు నేరుగా వచ్చే ఇంటర్నేషనల్ విమానాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుంది. యూకేలో ఓమిక్రాన్ కేసులు ఎక్కువ అవుతున్న క్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోకి వస్తున్న కేసుల్లో ఎక్కువ శాతం కేసులు యూకే నుంచి వస్తున్న వారివే అంటూ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందో చూడాలి అంటూ మమతా బెనర్జీ అన్నారు.
ఎట్ రిస్క్ దేశాల నుంచి బెంగాల్ వచ్చే ఇంటర్నేషనల్ ప్రయాణికులు సొంత ఖర్చులతో టెస్టులు చేయించుకోవాల్సిందే అని ఆదేశాలు ఇచ్చింది. మొత్తం ప్రయాణికుల్లో 10 శాతం మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎయిర్ లైన్స్ సంస్థ చేయాలని…మిగతా 90 శాతం మంది రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.