Akhanda Title Song :”అఖండ” టైటిల్ సాంగ్ టీజర్.. ఇరగదీసిన బాలయ్య

-

నందమూరి బాలకృష్ణ… వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే.. బాలయ్య…. అఖండ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ను క్రేజీ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కుస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వ‌చ్చింది.

దీపావళి శుభాకాంక్షలు చెబుతూ..  ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ ప్రోమో విడుదల చేసింది అఖండ చిత్ర బృందం. భమ్‌.. అఖండ అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్‌ లో బాలయ్య… వెరీ పవర్‌ ఫుల్‌ లుక్ లో కనిపించారు. శూలం పట్టుకుని… తలకు విబూదీ పెట్టుకుని… విధ్వంస కరంగా కనిపించారు బాలయ్య. ఇక దీని పూర్తి సాంగ్‌ ను నవంబర్‌ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news