తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తారా లేదా : బండి సంజయ్

-

కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ పెట్రోల్ పై ఐదు రూపాయలు… డీజిల్ పై పది రూపాయల వ్యాట్ తగ్గించిన‌ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్నీ కూడా పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను తగ్గించాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ పై కేంద్రం రూ.5 డీజిల్ పై రూ. 10 తగ్గిస్తున్నట్లు నరేంద్రమోడీ జీ ప్రభుత్వం ప్రకటించిందని సంజ‌య్ పేర్కొన్నారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్నీ పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను త‌గ్గించాయ‌ని చెప్పారు. మ‌రి తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పెట్రోల్ డీజిల్ పై సుంకాన్ని తగ్గిస్తుందా లేదా అని ప్రశ్నించారు. కాగా ఇటీవల హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ నాయకులు సిలిండర్ ధరల ను కేంద్రం పెంచిందంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పై కేంద్రం ధర తగ్గించడంతో తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆస‌క్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news