అప్పుడేనా: రేపటినుండి సోనీ లివ్ లో అఖిల్ “ఏజెంట్” .. !

-

అఖిల్ అక్కినేని ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన సినిమా “ఏజెంట్”.. రేస్ గుర్రం దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ లలో రిలీజ్ అయింది. మొదటి షో నుండి ఈ సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో, కనీసం వారం కూడా థియేటర్ లలో ఉండకుండా తీసివేశారు. అలా మరోసారి అఖిల్ కెరీర్ లో ప్లాప్ మూవీ పడింది. కాగా ఇంకా అఖిల్ కు సరైన హిట్ దక్కాలంటే ఎంతకాలం పడుతుందో అని కామెంట్ చేస్తున్నారు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ఈ సినిమా ఓ టి టి లో రిలీజ్ కావడానికి సిద్ధం ఉంది. రేపటి నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవనుంది. రిలీజ్ అయిన మూడు వారాలలోనే ఓ టి టి లోకి రావడంతోనే
మూవీ ఎంత డిజాస్టర్ అన్నది యిట్టె తెలిసిపోతుంది.

ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటించగా, కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించాడు. అయినా ఇవేమీ సినిమాను కాపాడలేకపోయాయి. మరి చూద్దాం ఓ టి టి లో అయినా ప్రేక్షకులు ఆదరిస్తారా ?

Read more RELATED
Recommended to you

Latest news