కేసీఆర్ కు రాసిన లేఖ పై కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ దేవుడు.. కానీ, కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయని బాంబు పేల్చారు కవిత. అలాంటివాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న కవిత ఈ సందర్బంగా మాట్లాడారు.

ఈ సందర్బంగా కవితకు ఘనంగా స్వాగతం పలికారు జాగృతి, బీసీ సంఘాల నాయకులు. కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కోసం ఈ నెల 16న అమెరికా వెళ్లిన కవిత… అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అంతరంగికంగా కేసీఆర్కు రాసిన లేఖ బహిర్గతం కావడం బట్టి పార్టీలో ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలని సూచనలు చేశారు. కేసీఆర్ కు రాసిన లేఖ వాస్తవమే అన్నారు కల్వకుంట్ల కవిత.