తారకసింహా రెడ్డిగా అఖిల్…. సైలెంట్ గా షూటింగ్ మొదలు

-

అక్కినేని అఖిల్ కు పాపం కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క బ్లాక్ స్టార్ ను కూడా చూడలేదు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా తో ఓ మోస్తారు హిట్టు అందుకున్నప్పటికీ, ఆ తరువాత సక్సెస్ ను మళ్లీ సాధించలేకపోయాడు. ఇక భారీ అంచనాలు పెట్టుకుకున్న ఏజెంట్ తీవ్ర నిరాశను పరిచింది.నిజానికి ఒక కమర్షియల్ హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ అఖిల్ లో ఉన్నప్పటికీ కూడా టైం కలిసిరావడం లేదు . ఏజెంట్ చిత్రం విడుదలై ఇప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా అఖిల్ తన ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇక అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ తర్వాత చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం తర్వాత చిత్రం షూటింగ్ కూడా మొదలైందని వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని ఓ ఫారెస్ట్ సైలెంట్ గా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ మూవీ లో అఖిల్ ధీర అనే యుద్ధవీరుడి పాత్రలో కనిపిస్తాడని, ఈ చిత్రానికి తారకసింహా రెడ్డి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news