వరలక్ష్మిని అందుకే చంపా : పోలీసులతో అఖిల్ !

విశాఖలో సంచలనం రేపిన వరలక్ష్మి మర్డర్ కేసులో అనేక సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసు నిందితుడు అఖిల్ సాయి ప్రేమ మాటను పగ పెంచుకుని ఈ హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసులు మొదటి నుండి బావిస్తూ వచ్చారు. తనకు బ్రేకప్ చెప్పగానే తనకు దూరమైన వరలక్ష్మి మరెవరికీ దక్కకూడదనే కోపంతోనే అత్యంత దారుణంగా హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు భావించారు. అయితే ఇది నిజమేనని అఖిల్ తేల్చేసాడు.

ఈ వరలక్ష్మి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అఖిల్ పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు వెల్లడించాడు. ఘటన స్థలంలో దొరికిన నల్లటి వస్త్రం వరలక్ష్మిదే నని పేర్కొన్నాడు అఖిల్. ఘటనా స్థలంలో ఆమె పక్కనే నిమ్మకాయలు, పసుపు ఆ పక్కనే ఈ నల్లటి వస్త్రం దొరకడంతో చేతబడి పూజలు ఏమైనా జరిగియా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే కారం బ్లేడు తానే కొన్నానని పేర్కొన్న అఖిల్, తాము వెళ్ళేప్పటికే ఎవరో అక్కడ పూజలు చేశారని పేర్కొన్నారు. తనను కాదని మరో వ్యక్తికి దగ్గరవుతున్నందుకే చంపానని అఖిల్ ఒప్పుకున్నాడు.