బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన భూమా అఖిల ప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. చంచల్ గూడ జైల్లో 17 రోజులుగా రిమాండ్ లో ఉంటున్న అఖిల ప్రియ రేపు జైల్ నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ని మాత్రం కోర్టు కొట్టేసింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ ప్రధాన నిందితురాలు అని పోలీసులుతేల్చేశారు. మొత్తం ప్లాన్ చేయడం నుండి దానిని అమలు పరిచే దాకా ఆమె అన్ని విషయాల్లోనూ ఇన్ వాల్వ్ అయినట్టు హైదరాబాద్ పోలీసులు నిర్ధారించారు.