సంక్రాంతి రేస్ నుండి తప్పుకోనున్న ‘వెంకీ మామ’….??

-

ప్రతి ఏడు మాదిరిగా రాబోయే సంక్రాంతికి పలు టాలీవుడ్ బడా సినిమాలు రిలీజ్ కు సర్వదా సిద్ధం అవుతున్నాయి. అయితే ఈసారి సూపర్ స్టార్ మహేష్ మరియు అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడంతో పాటు, అవి రెండు కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో వీటిపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

జనవరి 12న రిలీజ్ బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్న ఈ రెండు సినిమాల తరువాత జనవరి 10న సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్, అలానే జనవరి 15న యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే వీటితో పాటు విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని నాగచైతన్య హీరోలుగా తొలిసారి కలిసి నటిస్తున్న వెంకీ మామ కూడా రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మొదటి నుండి ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేద్దాం అని భావించినప్పటికీ, ఆ సమయంలో అత్యధిక సినిమాల రిలీజ్ ఉన్న కారణంగా థియేటర్స్ కొరత ఏర్పడే అవకాశం ఉందని భావించి, తమ సినిమాను మరింత వెనక్కు తీసుకెళ్లాలని నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నట్లు చెప్తున్నారు. అదీకాక ఎంతో భారీ అంచనాలతో వస్తున్న సినిమాల మధ్య తమ సినిమా రిలీజ్ చేస్తే, ఏ మాత్రం రిజల్ట్ తేడా కొట్టినా అసలుకే మోసం వస్తుందని కూడా భావిస్తున్నట్లు టాక్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా వెంకీ మామ సినిమా వాయిదాపై అధికారిక ప్రకటన మతం రావాల్సి ఉంది….!!

Read more RELATED
Recommended to you

Latest news