ఏపీ ఇన్‌చార్జి చీఫ్ సెక్రటరీగా నియమితులైన నీరబ్‌కుమార్ ప్రసాద్ ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఆయనకు బదిలీ అయిన సీఎస్ సుబ్రహ్మణ్యం బాధ్యతలు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు నియమితుడైన సి.ఎస్.సుబ్రహ్మణ్యంను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించిన విషయం తెలిసిందే.
అంతర్గతంగా ఏం జరిగిందోగాని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయనను అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ సుబ్రహ్మణ్యం బదిలీ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో సంచలనం రేపింది. కొత్త సీఎస్‌ను నియమించే వరకు ప్రభుత్వం నీరబ్‌కుమార్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఈరోజు విధుల్లో చేరారు.