అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..కింగ్‌ నాగ్‌ కొత్త మూవీ ప్రీ లుక్‌ రిలీజ్‌

-

అక్కినేని ఫ్యామిలీ అంటే టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో ఓ క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా కింగ్‌ నాగార్జున సినిమాలంటే.. ఇప్పటికే టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎగబడతారు. అయితే.. తాజాగా అక్కినేని ఫ్యాన్స్‌ కు కింగ్ నాగార్జున అదిరిపోయే సర్‌ ఫ్రైజ్‌ ఇచ్చాడు. కింగ్‌ నెక్ట్స్‌ మూవీ అనే యాష్‌ ట్యాగ్‌ తో కొత్త ప్రీ లుక్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా రిలీజ్‌ అయిన ఈ మూవీని స్టార్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తార్‌ తెరకెక్కుస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు శరత్‌ మారార్ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా లో కింగ్‌ నాగార్జున సరసన కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఈ మేరకు ప్రీ లుక్‌ రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ ప్రీ లుక్‌ లో కింగ్‌ నాగార్జున క్లాస్‌ డ్రెస్‌… ఓ కత్తి పట్టుకుని ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే… ఈ సినిమా ”డాన్‌” మూవీ తరహాలో ఉంటుందని అర్థమౌవుతుంది. ఇక ఈ సినిమా మరో అప్డేట్‌.. 29 వ తేదీన విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news