Breaking : అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం..!

-

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంత తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్షయ్ కుమార్ తల్లి అరుణ బాటియా మృతి చెందింది. అరుణ బాటియ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా ఆమె అనారోగ్యం తో బాధపడుతూ మరణించినట్టు అక్షయ్ కుమార్ వెల్లడించారు. తన తల్లి మరణం తనకు తీరని లోటు అని అక్షయ్ అన్నారు. తల్లిని కొల్పడం భరించలేని నొప్పి అని వ్యాఖ్యానించారు.

తన తల్లి కూడా తన తండ్రి వద్దకు మరో ప్రపంచానికి వెళ్లిపోయిందని..ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని అక్షయ్ పేర్కొన్నారు. ఇక అక్షయ్ ఇంట విషాదం తో బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఇటీవలే బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా మరణం తో బాలీవుడ్ ఉలిక్కి పడగా మరోసారి బాలీవుడ్ షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఇక బాధలో ఉన్న అక్షయ్ కుమార్ కుమార్ కు పలువురు బాలీవుడ్ నటి నటులు దైర్యం చెబుతున్నారు. అంతే కాకుండా అక్షయ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఆయన తల్లి ఆత్మకు శాంతి కలగాలని కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news