అమ‌లా పాల్ నా కొడుకుని మోసం చేసింది.. విజ‌య్ తండ్రి ఆవేద‌న‌..!!

-

అమలా పాల్.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. కేర‌ళ‌కు చెందిన ఈ బ్యూటి.. రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన‌ నాయ‌క్ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఒక‌ప్పుడు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపిందీమే. ఇక ఇటీవ‌ల ‘ఆడై’ చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది ఈమె. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. అమలాపాల్‌ దర్శకుడు విజయ్‌ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

పట్టుమని ఏడాది కూడా కాపురం చేయకుండానే ఇద్దరూ విడిపోయి ఎవరికి కావాల్సిన స్వాతంత్రాన్ని వాళ్లు కోరుకున్నారు. ఇక వీరు విడిపోవ‌డానికి మనస్పర్థలే కార‌ణ‌మ‌ని ఎన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. మ‌రోవైపు వీరిద్ద‌రి విడాకుల వెనుక స్టార్ హీరో రజినీకాంత్ అల్లుడు ధనూష్ కార‌ణ‌మ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా అమలా పాల్ విడాకులు వెనుక అస‌లు నిజాలు ఓ ఇంటర్వ్యూలో బ‌య‌ట పెట్టాడు విజయ్ తండ్రి అజగప్పన్. “విజయ్, అమలా పాల్ ప్రేమించుకున్నారు .. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

మతాలు వేరైనా.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్

పెళ్లి తరువాత అమలా పాల్ సినిమాలు చేయడం విజయ్ కి ఇష్టం లేదు. ఈ క్ర‌మంలోనే విజ‌య్‌ ఇష్ట ప్రకారమే సినిమాలు మానేస్తానని అమలా పాల్ మాట ఇచ్చింది. కానీ పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టి.. విజ‌య్‌ను మోసం చేసింది. మేము చెప్పినా .. ఆమె త‌ల్లిదండ్రులు
చెప్పినా ఆమె తన పద్ధతిని మార్చుకోలేదు. తన జీవితం..తన ఇష్టం అన్నట్లే వ్యవరించింది త‌ప్పా ఇత‌రుల గురించి ఆలోచించ‌లేద‌ని.. ఇక‌ ఎవరు ఎంతగా చెబుతున్నా ఆమె పట్టించుకోక‌పోవ‌డంతో.. విడాకుల వరకూ వెళ్లవలసి వచ్చింది“ అని విజ‌య్ తండ్రి అజగప్పన్ చెప్పుకొచ్చాడు. అయితే ప్ర‌స్తుతం విజ‌య్ ఎంతో ఆనందంగా ఉన్నాడంటూ స్ప‌ష్టం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news