ఏపీ కాంగ్రెస్ కూడా రమేష్ కుమార్ కు అండగా…!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగించిన విషయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై విపక్ష తెలుగు దేశం పార్టీ సహా అనేక పార్టీలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో జోక్యం చేసుకుంది. హైకోర్ట్ లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పిటీషన్ వేసారు.

ఇప్పటికే ఈ వ్యవహారంపై పిటీషన్లు దాఖలు కాగా ఏపీ సర్కార్ ని కౌంటర్ దాఖలు చేయమని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే ఏపీ సర్కార్ ముందుకి వచ్చి దాఖలు చేయకుండా మరి కొన్ని రోజులు గడువు కావాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఏపీ సర్కార్… మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టీస్ కనగరాజు ని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇక రమేష్ కుమార్ ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి తొలగించడం అది కూడా కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ తీర్పు ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news