సమాజంలో లైంగిక సంబంధాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కొన్ని సార్లు కోర్టులు కొన్ని కేసులను ఆధారంగా చేసుకుని స్పష్టమైన చట్టాలను ప్రజలకు తెలియచేస్తున్నాయి. ఇక తాజాగా మరొక్క కీలక విషయాన్ని అలహాబాద్ కోర్ట్ ప్రజలకు తెలిసేలా చేసింది. సహజీవనం గురించి ఈ కోర్ట్ తెలియచేస్తూ కొన్ని నియమాలను తెలిపింది. అమ్మాయి మరియు అబ్బాయి సహజీవనములో ఉండాలంటే ఖచ్చితంగా వారు మైనర్ లు అయి ఉండకూడదని తెలిపింది, అదే సమయంలో వారికి 18 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపింది. ఒకవేళ అలా చేస్తే అది పూర్తిగా చట్టవిరుద్ధం అవుతుందని ఒక కేసులో వివరంగా తెలియచేసింది. అంతే కాకుండా 18 సంవత్సరాల లోపు వయసున్న అబ్బాయి తనకంటే పెద్ద వయసు ఉన్న మహిళతో సహజీవనం చేయడం చట్టపరంగా మంచిది కాదని అలహాబాద్ కోర్ట్ చెప్పింది.
ఈ సమాజంలో ఏ ఇద్దరు వ్యక్తులు అయినా కలిసి జీవించడానికి స్వేచ్ఛ ఉందని .. కానీ వారిద్దరూ కూడా మజార్ లు అయి ఉండాలని స్పష్టంగా చెప్పింది.