మధ్యాహ్నం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో కిషన్ రెడ్డి మరియు కీలక నేతలతో హై లెవెల్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో తెలంగాణ బీజేపీ టార్గెట్ ను స్పష్టంగా కిషన్ రెడ్డికి తెలియచేశారు. కాగా ఈ మీటింగ్ అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగిస్తుందని ధీమాను వ్యక్తం చేశాడు కిషన్ రెడ్డి. తెలంగాణాలో పరిస్థితులు అన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయంటూ మాట్లాడారు కిషన్ రెడ్డి. ఇక మా పార్టీ తరపున ఎమ్మెలేలుగా పోటీ చేసే అభ్యర్థుల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కేంద్రం మార్గదర్శకాల్లో తెలంగాణాలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నేతలు అంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు కిషన్ రెడ్డి.
మరి కిషన్ రెడ్డి చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా ? ఎందుకు బీజేపీలో ఇంత నమ్మకం అన్నది ఎవ్వరికీ అంతుబట్టని ప్రశ్న . వాస్తవ పరిస్థితులు చూస్తే మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడని రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.