ఖాతాదారులకు అలర్ట్…నేడు రేపు బ్యాంకులు బంద్…!

దేశవ్యాప్తంగా ఈరోజు రేపు ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. దేశం లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంకర్ల సంఘం సమ్మెకు సిద్ధం అయ్యింది. పార్లమెంట్ లో బ్యాంకింగ్ యాక్టుకు సంభందించి కేంద్రం సవరణలు చేయవద్దని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా నష్టాల పేరు చెప్పి కేంద్రమే బ్యాంకులను మూసివేయాలని చూస్తోంది అంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నే ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు.

దాంతో దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 70 వేల మంది బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా కేంద్రం ఇప్పటికే కొన్ని ప్రభుత్వం బ్యాంకులను విలీనం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రైవేటీకరణ పేరుతో ఉద్యోగుల్లో ఆందోళన సృష్టిస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రకటించడం తో అక్కడ కూడా నిరసనలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. మరోవైపు సింగరేణి సైతం ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగుతోంది.