శ్రీ‌వారి భ‌క్తుల‌కు అలెర్ట్.. నేడే తిరుమ‌ల ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల

-

ఫిబ్ర‌వ‌రి నెల‌లో తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోవాల‌నుకుంటున్న భ‌క్తుల‌కు అలెర్ట్.. నేడే ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించిన తిరుమ‌ల తిరుప‌తి శ్రీ‌వారి ద‌ర్శ‌నం టికెట్లను టీటీడీ విడుద‌ల చేయ‌నుంది. ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ అధికారిక వెబ్ సైట్ tirupatibalaji.ap.gov.in లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం టికెట్ల‌ను అందుబాటులో ఉంచ‌నుంది. ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు రూ. 300 ల‌తో ప్రత్యేక ద‌ర్శ‌నం టికెట్ల‌ను టీటీడీ త‌మ అధికారిక వెబ్ సైట్ లో విడుద‌ల చేయ‌నుంది.

ప్ర‌తి రోజు 12 వేల చొప్పున రూ. 300 క‌లిగిన ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్లు టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచ‌నుంది. కాగ ఫిబ్ర‌వ‌రి లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న వారు ఈ అవ‌కాశాన్ని వ‌దులు కోవ‌ద్దు. ఉద‌యం 9 గంట‌ల‌కే విడుద‌ల కానున్నాయి. అలాగే తిరుమ‌ల తిరుప‌తి శ్రీ‌వారి స‌ర్వ ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఈ నెల 29 నుంచి టీటీడీ అధికారిక వెబ్ సైట్ లోనే అందుబాటులోకి రానున్నాయి. ప్ర‌తి రోజు 10,000 టికెట్ల చొప్పున ఆన్ లైన్ లో విడుదల చేయ‌నున్నారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు కూడా రేప‌టి నుంచి ప్ర‌తి రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు అందుబాటులోకి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news